అబద్ధాల రారాజు ప్రధాని మోదీ : అసదుద్దీన్‌ ఓవైసీ

Tue,April 9, 2019 11:50 AM

MIM MP asaduddin owaisi fire on PM Modi Politics

హైదరాబాద్‌ : మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో ఓవైసీ మాట్లాడారు. దేశ ప్రధాని అబద్ధాలు మాట్లాడడం సరికాదు. అబద్ధాల రారాజు ప్రధాని నరేంద్ర మోదీ అని ఓవైసీ విమర్శించారు. మోదీ ధనవంతులకే చౌకీదార్‌. వ్యాపారులు, బ్యాంకు ఎగవేతదారులకే మోదీ కాపలాదారుగా ఉన్నారు. మోదీ లాంటి నాయకులకు ఓటు వేయొద్దు. దేశం, రాజ్యాంగం కంటే మోదీ గొప్పవాడేం కాదు. దేశంలో రాజ్యాంగమే అంతిమంగా అత్యున్నతమైనది. మోదీ చెప్పిన అచ్చేదిన్‌ ఏమైంది. 5 కోట్ల యువతకు ఉద్యోగాలు అన్నారు.. వచ్చాయా? అని ఓవైసీ ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. సుప్రీంకోర్టులో కేసు ఉందంటూ కేంద్రం ఎటూ తేల్చడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్నే మోదీ అమలు చేస్తున్నారు.

ఏపీలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే కాదు.. ఇంకా చాలా పార్టీలున్నాయి. ప్రాంతీయ పార్టీల్లోనూ గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు. మన సీఎం కేసీఆర్‌ కూడా ఎంతో గొప్ప నాయకుడు. కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌దే కీలకపాత్ర. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిపి 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. మేం ఎవరికీ బీ టీమ్‌, సీ టీమ్‌ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. అక్కడ వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది. 21 ఎంపీ సీట్లు, 130 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. జగన్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles