కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Sat,November 17, 2018 06:46 PM

milk abhishek to cm kcr photo in kamareddy dist

రైతుబంధుకు ఐరాస గుర్తింపుపై రైతుల హర్షం
కామారెడ్డి: టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వివిధ దేశాల్లోని 20 పథకాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చెందిన రైతుబందు, రైతుబీమా పథకాలు రెండు ఎంపిక కావడం విశేషమని తెలిపారు.

ఈ పథకాలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందడం గొప్ప విషయమన్నారు. ఈ నెల 21, 23 తేదీల్లో రోమ్ నగరంలోని వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయంలో ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

2281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles