మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రో పనులు...

Fri,August 16, 2019 04:16 PM

Metro rail work from Mindspace Junction to Shamshabad

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాక మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని రూ.5 వేల కోట్లతో పనుల అంచనా వేసినట్లు పేర్కొన్నారు. హైటెక్‌ సిటీ నుంచి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వరకు జరుగుతున్న పనులు చివరి దశలో ఉన్నాయి. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి మైండ్‌స్పేస్‌ స్టేషన్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైటెక్‌సిటీ రివర్సల్‌ సౌకర్యం పూర్తయింది. భద్రత అనుమతులు వచ్చాక నాలుగైదు రోజుల్లోనే ట్విన్‌ సింగిల్‌లైన్‌ విధానం అమలు చేస్తామన్నారు. హైటెక్‌ సిటీ నుంచి జూబ్ల్లీచెక్‌పోస్టు వరకు అవసరాన్ని బట్టి మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ 5 నుంచి 3 నిమిషాలకు కుదిస్తామని తెలిపారు. ఈనెల 14వ తేదీన ఒక్క రోజే మెట్రోలో అత్యధికంగా మూడు లక్షల ఆరువేల మంది ప్రయాణం చేశారని వెల్లడించారు.

2276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles