ఈ ఏడాది సాధారణ వర్షపాతమే : ఐఎండీ

Mon,April 15, 2019 04:53 PM

హైదరాబాద్ : 2019 ఏడాదికి వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపిన ఐఎండీ.. 96 శాతం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంపై మే 15న ధ్రువీకరిస్తామన్నారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు అనుకూలంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందన్నారు. గత రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయి. పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా ఉండదు. తెలుగు రాష్ర్టాల్లో సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను ప్రారంభిస్తామని తెలిపారు.

2639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles