వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్

Tue,December 3, 2019 09:01 PM

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసముండే నల్లూరి సిద్ధయ్య అనే ఇటుకల వ్యాపారిని కిడ్నాప్ చేసి, డబ్బులు దండుకొని వదిలేసి పోయిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 25న సిద్ధయ్య పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని ఇటుకబట్టీల వద్ద పనులు ముగించుకుని రాత్రిపూట బైక్‌పై ఇంటికి వస్తుండగా కిడ్నాప్ చేసి అతడి జేబులో ఉన్న రూ. 50వేల నగదు, బంగారు ఉంగరం, ఏటీఎం కార్డులను లాక్కొని, పిన్ నెంబర్లతోపాటు ఆయన భార్యకు ఫోన్ చేయించి బెదిరించి, ఇంట్లో ఉన్న డబ్బంతా కవర్‌లో పెట్టుకుని సిద్ధయ్యను వదిలేసి ఉడాయించిన విషయం తెలిసిందే.


అయితే ఏటీఎం కార్డులను వెంట తీసుకెళ్లిన ముఠా సభ్యులు హైదరాబాద్, కోదాడ, సూర్యాపేట, తొర్రూరు, ఉప్పల్ ప్రాంతాల్లో నగదు డ్రా చేయడంతో వచ్చిన మేసేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం వేశారు. సూర్యాపేట జిల్లా పోలీసుల సహకారంతో నిందితుల ఫోటోలు, వాహనాల నెంబర్లను సేకరించారు. అయితే కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు సిద్ధయ్య నుంచి వసూలు చేసిన డబ్బులను పెద్దపల్లిలో ఉంటున్న ప్రధాన నిందితురాలు రజని వద్ద వాటాలు పంచుకునేందుకు వచ్చిన సందర్భంలో పట్టుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు.

నిందితులను విచారించిన పోలీసులు గుండా రజని వద్ద నుంచి రూ. 2లక్షల నగదు, గడ్డం ప్రవీణ్‌కుమార్ వద్ద రూ.1.50 లక్షలు, మూడు కత్తులు, మున్నా వద్ద నుంచి రూ. 30వేలు, గడ్డం కిరిటీ వద్ద 1.30 లక్షలు, గడ్డం రమేశ్ వద్ద నుంచి రూ. 50వేలు, షేక్ బాషా వద్ద రూ. 38,100 నగదు చొప్పున ఆరుగురి నుంచి రూ.5,98,100 నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, ఇన్నోవా, తవేరా వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. కిడ్నాప్ వ్యవహారంలో పాలుపంచుకున్న హన్మకొండకు చెందిన షకీల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఈజీ మనీ కోసమే..


పెద్దపల్లి పట్టణానికి చెందిన గుండా రజినీ కాజిపేటలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నదనీ, ఈమె యాదాద్రి మండలం మారేగుగూడెంకు చెందిన గడ్డం ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పాటు చేసుకొని ఈజీ మనీ కోసం కిడ్నాప్‌కు వ్యూహాం పన్నారు. ఇందుకోసం ప్రవీణ్‌కుమార్ తన సోదరుడు గడ్డం రమేశ్, జనగామ జిల్లా జాఫర్‌ఘడ్ మండలం కూక్‌నూర్‌కు చెందిన డ్రైవర్లు గడ్డం కిరిటీ, షేక్ భాషా, హన్మకొండ మచిలీబజార్‌కు చెందిన షకీల్ అలియాస్ సయ్యద్ యాకూబ్ పాషా, వరంగల్‌రూరల్ జిల్లా ఐలవోని మండలం వెంకటాపూర్‌కు చెందిన మున్నాతో కలిసి ముఠాగా ఏర్పడి వ్యూహం పన్నినట్లు తమ విచారణలో తేలిందన్నారు.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles