గతం గుర్తొచ్చి మామూలైన వ్యక్తులు

Fri,March 24, 2017 06:40 AM

Mental handicaped men to return to normal life

గోదావరిఖని: తమ గతం మర్చిపోయి పిచ్చివాళ్లుగా తిరుగుతున్న పలువురు మానసిక వికలాంగులు పోలీసుల కృషితో తిరిగి మళ్లీ మమూలు వ్యక్తులైయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మూడు నెలల కిందట రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ చేపట్టిన పునర్జన్మ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుంది. కమిషనరేట్ పరిధిలో మతిస్థిమితం లేని 83 మందిని గత ఏడాది డిసెంబర్ 26న చేరదీశారు. వీరిని నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మా, నాన్న అనాథ ఆశ్రమంలో చేర్పించారు. వారందరికీ ఎనిమిది నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కొత్త బట్టలను అందజేశారు. ఆశ్రమంలో ధ్యానం, పలు వ్యాయామాలతో 20 మందిలో మార్పు వచ్చింది. తమ వివరాలు తెలుపగా, ఆరుగురిని ఇప్పటికే నిర్వాహకులు ఇండ్లకు చేర్చారు. గురువారం 14 మందిని రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహించిన పునర్జన్మ సత్ఫలితాలనివ్వడం సంతోషంగా ఉన్నదన్నారు. తమ కృషికి అమ్మా, నాన్న ఆశ్రమం నిర్వాహకులు తోడవడంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. త్వరలోనే మరిన్ని పునర్జన్మ కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. మరో 50 మందిలో కూడా మార్పు వచ్చే అవకాశమున్నదని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

1483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles