ఆ కోచ్‌లో పురుషులకు ప్రవేశం లేదు

Wed,May 16, 2018 01:13 PM

Men board ladies coaches in peak hours in hyderabad metro

హైదరాబాద్ : మహిళా ప్రయాణికుల కోసం మెట్రో రైళ్లలో ఇటీవలే ప్రత్యేక కోచ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే రద్దీ సమయాల్లో మహిళా కోచ్‌ల్లోకి పురుషులు కూడా ఎక్కుతున్నారు. ఇదే విషయాన్ని ఓ మహిళా ప్రయాణికురాలు ట్విట్టర్ ద్వారా మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రద్దీ, రద్దీ లేని సమయాల్లో మహిళా కోచ్‌లోకి పురుషులు ఎక్కకుండా చూడాలని, ఈ విషయంలో ప్రయాణికులను చైతన్యవంతం చేయాలని కోరారు. అదే విధంగా మెట్రో స్టేషన్లలో ఉంటున్న సిబ్బంది ఈ అంశంపై దృష్టి సారించాలని కోరింది. ఈ ప్రయాణికురాలి ట్వీట్‌పై హెచ్‌ఎమ్మార్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మహిళా కోచ్‌లోకి పురుషులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. మెట్రో స్టేషన్లలో అవగాహన కోసం బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని మెట్రో సిబ్బందికి చెప్పారు.

2911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles