వేంకటేశ్వరునికి వైభవంగా చక్రస్నానం

Tue,March 13, 2018 09:07 PM

mellacheruvu venkateswara swamy brahmotsavam

మేళ్లచెర్వు : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని మైహోం ఇండస్ట్రీస్ ఆవరణలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలను శ్రీ అహోబిల రామానుజ జీయర్ పర్యవేక్షణలో ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారిని,అమ్మవార్లను రథంపై ఊరేగించారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదమంత్రాలతో శాస్ర్తోక్తంగా చేశారు. కార్యక్రమంలో మైహోం పరిశ్రమ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, శ్రీకుమారి దంపతులు, వినోదరావు, రంజిత్‌రావు, రామూరావు, శ్యామూరావు, మునగాల రామ్మోహన్‌రావు, అరుణ, సుధాకర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మైహోం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

1625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles