ఈ నెల 19న మెగాజాబ్ మేళా

Fri,January 11, 2019 07:19 AM

Mega job mela to be conducts on january 19th in hyderabad

చాంద్రాయణగుట్ట : జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. 19న శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంజన్ ప్రోగ్రెస్సిస్ పాఠశాల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్ మేళా సందర్భంగా గురువారం జాబ్ కనెక్టివిటీ వాహనం ద్వారా నిరుద్యోగ యువతీ,యువకులకు అవగాహన కల్పించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. మేళాకు వచ్చే వారు 18వ తేదీ వరకు ఆన్ లైన్(www.tmievancom)లో దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

మొదటిరోజైన బుధవారం 345 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నారు. గురువారం కూడా దాదాపుగా 300 వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జాబ్ మేళాలో మొత్తం 21 కంపెనీలు పాల్గొంటున్నాయని, ఏడు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, డిప్లొమా కోర్సులు చదివిన వారు అర్హులని పోలీసులు తెలిపారు.

2863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles