ట్రాఫిక్‌పై రేపు రవీంద్రభారతిలో సమావేశం

Wed,June 28, 2017 08:11 AM

Meeting in Ravindra Bharathi tomorrow on Traffic

ట్రాఫీక్ రద్దీని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్య లపై ఈ నెల 29న రవీంద్రభారతిలో పాఠశాల యాజమాన్యలతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో మొత్తం 3218 ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అదే విధంగా విద్యా ర్థుల భద్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన నేపధ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ రవీందర్ తెలిపారు. ప్రతి స్కూల్ మేనేజ్‌మెంట్ తరపును ప్రిన్సిపాల్, కరస్పాడెంట్, పీఈటీలో ఎవరైనా ఒకరు ఈ సమావేశానికి హాజరై వారి సూచనలు, అభిప్రాయాలను తెలిపి వాటిపై చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్, పోలీసు కమిషనర్, విద్యాశాఖ, ఆర్‌టీఏ, జీహెచ్‌ంసీ, ఆర్టీసీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని రవీందర్ చెప్పారు.

822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles