నర్సు సహకారంతోనే శిశువు అపహరణ..నిందితులు అరెస్ట్

Tue,February 19, 2019 09:08 PM

Medipally police trapped Child Kidnap case accused

మేడ్చల్ : శిశువు అపహరణ కేసును మేడిపల్లి పోలీసులు 3 గంటల్లోనే ఛేదించారు. నారపల్లి ప్రభుత్వాస్పత్రిలో మగశిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో శిశువు తల్లిదండ్రులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు గాలింపు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఆస్పత్రిలో నర్సు సహకారంతోనే నిందితులు శిశువును ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. తమ బిడ్డను సురక్షితంగా ఒడిలోకి చేర్చిన పోలీసులకు తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు.

2272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles