వైద్యసేవలు గ్రామాలకు విస్తరించాలి: రాష్ట్రపతి

Sat,December 22, 2018 11:44 AM

Medical services should be extended to villages says president ram nath kovind

కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు ఇప్పటికి అందడం లేదని.. పట్టణాల్లోని వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావాలని రాష్ట్రపతి రామ్ కోవింద్ అన్నారు. కరీంనగర్ లో ప్రతిమ వైద్యకళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం గల కరీంనగర్ కు రావడం ఇదే ప్రథమమన్నారు. వైద్యరంగంలో మనదేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. మెడికల్ టూరిజానికి భారత్ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మన డాక్టర్లకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. పోలియో, స్మాల్ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించాం. వైద్య సేవల రంగంలో అభివృద్ధి సాధించినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా సమస్య బాధిస్తోందన్నారు. తలసేమియా బాధితుల విషయంలో ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉన్నామన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles