కేఎంసీలో ముగిసిన ఎంసీఐ బృందం తనిఖీలుTue,March 13, 2018 09:16 PM

కేఎంసీలో ముగిసిన ఎంసీఐ బృందం తనిఖీలు

వరంగల్ : వరంగల్ కాకతీయ వైద్య కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎంసీఐ) బృందం సభ్యుల తనిఖీలు మంగళవారం ముగిశాయి. కేఎంసీతో పాటు నగరంలోని అన్ని టీచింగ్ దవాఖానలన్నీ సోమవారం తనిఖీ చేసిన సభ్యులు రెండో రోజు మంగళవారం వర్ధన్నపేటలోని రూరల్ హెల్త్ సెంటర్, వరంగల్ అర్బన్ పరిధిలోని ఉర్సు అర్బన్ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. అసోంకు చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ కనకదాస్, కర్ణాటకకు చెందిన బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మీరాతో పాటు కేఎంసీ కమ్యూనిటీ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ పూనం కుమారిలు సందర్శించి, అక్కడ ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.

గుజరాత్‌కు చెందిన పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ భద్రీయియాస్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన డెర్మటాలజిస్టు ప్రొఫెసర్ డాక్టర్ నీలాయ్ సిన్హా, కేఎంసీలో అకడమిక్ బ్లాక్, హాస్టల్స్ భవనాలు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. కాకతీయ మెడికల్ కళాశాలకు 2013-14 సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్ల నుంచి అదనంగా 50 సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెంచారు. దీంతో అనాటి నుంచి 200 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా ఎంసీఐ నిబంధనల ప్రకారం కేఎంసీతో పాటు టీచింగ్ దవాఖానల్లో తగిన సదుపాయాలు, ఫ్యాకల్టీ అనువుగా ఉందా?, లేదా? తెలుసుకోవడానికి ఎంసీఐ బృందం ప్రతి సంవత్సరం తనిఖీలు చేపట్టారు. ఇప్పటికీ నాలుగు తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ బృందం చివరగా ఐదోసారి రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు.

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS