పరిశీలనలో నల్లగొండ మెడికల్ కాలేజీ: లక్ష్మారెడ్డి

Fri,March 24, 2017 11:20 AM

Medical college in Nalgonda?

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నల్లగొండలో మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిని రూ. 27 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిని 250 పడకల నుంచి 550 పడకలకు అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఐసీయూ, డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles