మే 24 శుక్రవారం 2019..మీ రాశిఫలాలు

Fri,May 24, 2019 06:32 AM

may 24th friday 2019 horoscopes

మేషం

మేషం : ఈ రోజు పనుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించటానికి లేదా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయటానికి అనుకూల దినం. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ సంతానం కారణంగా గుర్తింపు లభిస్తుంది. మీ తండ్రిగారి ఆరోగ్యం కుదుట పడుతుంది.

వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీలలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

మిథునం

మిథునం :ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం

కర్కాటకం :ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.


సింహం

సింహం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.


కన్య

కన్య : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం , ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.


తుల

తుల :ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతతతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.


వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.


ధనుస్సు

ధనుస్సు :ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

మకరం

మకరం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరం

మకరం : ఈ రోజు బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశ ముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్త్తులో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

మీనం

మీనం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.


10473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles