నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు

Sun,March 24, 2019 10:16 PM

mass marriages of poor couple in godavarikhani

- వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
గోదావరిఖని: ప్రతి సంవత్సరంలాగానే.. ఈసారి కూడా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. స్థానిక కోదండ రామాలయం ఆవరణలో సంప్రదాయాల మధ్య వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణలతో 21 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. కాగా, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు పెంట రాజేష్ ప్రతి ఏటా నిరుపేద జంటలకు దగ్గర ఉండి సొంత ఖర్చులతో ఒకే వేదికపై సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమన్నారు. నవ దంపతులను కోదండ రామాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ఊరేగింపు నిర్వహించి సాగనంపారు. ఫౌండేషన్ అధ్యక్షుడు పెంట రాజేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

1883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles