పెండ్లి చేసుకుంటానని ఓ పార్టీనేత కుమారుడి మోసం

Tue,March 26, 2019 07:44 AM

marriage fraud in shankarpally police station limits

రంగారెడ్డి : ఓ పార్టీకి చెందిన కుమారుడు యువతిని పెండ్లి చేసుకుంటానని గర్భవతి చేసి మోసం చేసిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే... రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పార్టీ నేత కుమారుడు తేజ్‌పాల్‌రెడ్డి శంకర్‌పల్లి మండలం, మోకిల గ్రామ శివారులోని విల్లాలోఉంటున్న యువతితో పరిచయం ఉంది. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం తేజ్‌పాల్‌రెడ్డి మరో యువతిని వివాహం చేసుకోగా... విషయం తెలుసుకున్న బాధిత యువతి తల్లిదండులకు తెలిపింది. యువతి తల్లిదండ్రులు ఈ నెల 11న శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే ఓ పార్టీకి చెందిన వ్యక్తి కుమారుడు కావడంతో విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శంకర్‌పల్లి సీఐ లింగయ్యను వివరణ కోరగా తేజ్‌పాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

2610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles