రూ.20లక్షల విలువచేసే గంజాయి పట్టివేత

Tue,November 14, 2017 10:51 PM

marijuana worth rs 20 lakh captured

అమరావతి : ఒడిశా రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీసులు పట్టుకున్నారు. చింతూరు మండలం గొర్రెలగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో 648 కేజీల గంజాయిని పాస్లస్టిక్ సంచుల్లో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులుకు చిక్కారు. ఇందులో నిందితులైన వరంగల్ జిల్లాకు చెందిన నాగుల రవి, మద్ది రాజశేఖర్‌ను అరెస్టు చేశారు. గంజాయితో పాటు వీరి వద్ద రెండు సెలఫోన్‌లు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపార. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాసకుమార్, సీఆర్‌పీఎఫ్ సి-42 బెలాటియన్ పోలీసులు పాల్గొన్నారు.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS