10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Mon,May 27, 2019 01:53 PM

MARIJUANA seize in Sangareddy dist

సంగారెడ్డి : ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుంచి బీదర్‌కు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 110 కిలోల గంజాయిని రెండు కార్లలో బీదర్‌ తరలిస్తున్నారు. సంగారెడ్డి చౌరస్తాలో ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ వాహనాలు పట్టుబడ్డాయి. రెండు కార్లలో నుంచి రూ. 10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles