సెయింట్‌గా మరియం థ్రెసియా! నేడు ప్రకటించనున్న పోప్

Sun,October 13, 2019 07:20 AM

కొచ్చి: కేరళకు చెందిన ప్రఖ్యాత క్రిస్టియన్ సన్యాసిని మరియం థ్రెసియాను సెయింట్‌గా ఆదివారం ప్రకటించనున్నారు. వాటికన్ నగరంలో నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రకటన చేయనున్నారు. మరియంతోపాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్ హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన మార్గరెట్ బేస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డుల్స్ లోప్స్, ఇటలీకి చెందిన సిస్టర్ గియుసెప్పినా వన్నినికి కూడా సెయింట్‌హుడ్‌ను పోప్ ప్రకటించనున్నారు.


1876 ఏప్రిల్ 26న జన్మించిన మరియం.. 50 ఏండ్ల వయసులో 1926 జూన్ 8వ తేదీన కన్నుమూశారు. మరియం పూర్తిపేరు మరియం థ్రెసియా చిరమెల్ మంకిడియాన్. మన దేశంలో మదర్ థెరెసా తర్వాత సెయింట్‌హుడ్ పొందిన రెండో వ్యక్తిగా మరియం నిలువనున్నారు.

567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles