ఓపెన్ వర్సిటీ అర్హతా పరీక్షకు మార్చి 28 గడువు

Thu,March 21, 2019 09:39 AM

March 28 deadline for Dr BR AmbeDkar open University eligibility test

హైదరాబాద్ : డా.బీఆర్.అంబే ద్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హతా పరీక్షకు హాజరుకావాలనుకునే వారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఎలాంటి విద్యార్హత లేకున్నా జూలై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారంతా అర్హతా పరీక్ష ద్వారా బీఏ.బీకామ్, బీఎస్‌సీ కోర్సు ల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 28వ తేదీన రెండు తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించనున్న అర్హతా పరీక్షకు హాజరుకావాల నుకునే వారు రూ.300 ఫీజుతో పాటు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని వారు పేర్కొన్నారు.

1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles