సీఎం కేసీఆర్ పాలనలో మరాఠిలకు న్యాయం..

Thu,November 8, 2018 04:48 PM

Marathas will develop in cm kcr government says prakash patil

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో మరాఠి లకు న్యాయం జరుగుతుందని తెలంగాణ మరాఠి మండలి సంఘం అధ్యక్షులు ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. తెలంగాణ మరాఠి మండలి సభ్యులు 10 వాహనాల్లో ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా సభ్యులు ఎంపీ వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరాఠి మండలి సభ్యులు వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తూ వ్యాపారాలు చేసుకుంటూన్నారని ప్రకాష్ పాటిల్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరాఠి ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలోని 10 వాహనాల్లో 50 మందితో వారం రోజులుగా మరాఠి సంఘం నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపు దిద్దుకుంటుందని, హైదరాబాద్ నగరంలో 2 ఎకరాల భూమి, రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. నగరంలో గత ప్రభుత్వాల హయాంలో కరెంటు కోతలతో వ్యాపారాల్లో నష్టపోయామని తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటుతో వ్యాపారాలు చేసుకుంటున్నమని అన్నారు. మాలీ, ప్రజాపతి, దేవసి, మరాఠి సంఘాలు కూడా రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎల్ కే షిండే, మదన్ జాధో, నివాసు, నిక్కిం, దిలీపు, జిత్తు, సురేష్ బోస్లే, ఆనంద్ పాటిల్, విశాల్ దేషాయీ, లతో పాటు పలువురు పాల్గొన్నారు.

1291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles