మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ లొంగుబాటు

Mon,February 11, 2019 05:10 PM

Maoist central committee member Sudhakar surrender

హైద‌రాబాద్‌: మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ అలియాస్ కిర‌ణ్ రాంచీ పోలీసులు ముందు లొంగిపోయినట్లు సమాచారం. 2013 నుంచి సుధాక‌ర్ కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు. భార్య మాధ‌వితో పాటు సుధాక‌ర్ లొంగిపోయిన‌ట్లు తెలిసింది. ఝార్ఖండ్ మావోయిస్టు కార్య‌క్ర‌మాల్లో సుధాక‌ర్ క్రియాశీల‌కంగా ఉన్నాడు. సుధాక‌ర్ స్వ‌స్థ‌లం నిర్మ‌ల్ జిల్లా సారంగాపూర్‌. సుధాకర్ పై కోటి రూపాయలు రివార్డు ఉంది.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles