నగరం నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు

Wed,September 18, 2019 07:02 AM

సికింద్రాబాద్: నాందేడ్ డివిజన్‌లోని ట్రాక్ మేయింటెనెన్స్ వల్ల నగరం నుంచి వెళ్లే పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. ఈనిర్ణయం 18 నుంచి 20 వరకు కొనసాగుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. మేడ్చల్ నుంచి నాండేడ్ మధ్య నడిపే డెమె ప్యాసింజర్‌తోపాటు, కాచిగూడ నుంచి మన్మాడ్ మధ్య నడిచే రైలుతో పాటు కాచిగూడ నుంచి నార్కెర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను మూడురోజులపాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుపతి నుంచి నాందేడ్ మధ్య నడిచే రైలును ఈనెల18న విశాఖపట్నం నుంచి నాందేడ్ రైలు కూడా18న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి పర్లి వైజ్‌నాథ్ మధ్య నడిచే రైలును కూడా ఈనెల 18,19,20 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles