నేటి నుంచి పలు రైళ్లు రద్దు

Thu,May 16, 2019 06:36 AM

Many trains canceled from today south central railway

కొత్తగూడెం : రోజూ ఉదయం 6.15 గంటలకు మణుగూరు నుంచి కాజీపేట (57657) వెళ్లే రైలు, మధ్యాహ్నం 1.50 గంటలకు కాజీపేట నుంచి మణుగూరు (57658) వచ్చే ప్యాసింజర్ రైలును 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు విజయవాడ (67245) నుంచి బయలుదేరి భద్రాచలం రోడ్ 12.45 గంటలకు చేరుకునే ప్యాసింజర్ డోర్నకల్ వరకే నడుస్తుందని, మధ్యాహ్నం 1.45 గంటలకు బయల్దేరే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-విజయవాడ (67246) వెళ్లే రైలు రద్దు చేశామన్నారు. ఈ రైలు డోర్నకల్ నుంచి ప్రారంభమై విజయవాడ వరకు సర్వీస్ నడుస్తుందని రైల్వే అధికారులు వివరించారు. రైల్వే పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

2873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles