టీఆర్‌ఎస్‌లోకి మంథని కాంగ్రెస్, టీడీపీ నేతలు

Fri,November 3, 2017 09:33 PM

manthani congress and tdp leaders joins in TRS party

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు. కాటారం మండలం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి సహా 200 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నేతలు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాటారం మండలం మాజీ ఎంపీపీ చల్లా సుజాత, మహాముత్తారం సింగిల్ విండో ఛైర్మన్ నర్సింహారెడ్డి, నర్సింగాపూర్ సర్పంచ్ లక్కిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాటారం సర్పంచ్ మనోహర్‌నాయక్, దామరకుంట సర్పంచ్ తోడే వీరారెడ్డి, మహదేవ్‌పూర్ మాజీ ఎంపీపీ కమ్మం బాపురెడ్డి, మహదేవ్‌పూర్ మాజీ జెడ్పీటీసీ జనగాం సమ్మయ్య, కాటారం మాజీ జెడ్పీటీసీ దుర్గ మల్లయ్య, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మాన బాపురెడ్డి, సీనియర్ నాయకుడు గుడిపాటి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నేత సోమ శాంతకుమార్, మహదేవ్‌పూర్ సీనియర్ నాయకుడు బాబుద్దీన్, బీజేపీ జిల్లా కార్యదర్శి బండం బాపురెడ్డి, కాంగ్రెస్ నేత జగన్‌నాయక్, మాజీ సర్పంచ్ మెరుగు పాపారావు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ పోటు మోహన్‌రెడ్డి, కాటారం మాజీ ఎంపీటీసీ ముత్తయ్యలు గులాబీవనంలో చేరారు.

1420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles