తెలంగాణ కవులు, సాహిత్యాన్ని కాపాడుకోవాలి: స్వామిగౌడ్

Sun,December 17, 2017 09:06 PM

Mandali Chairmen swamygoud says about telangana poets


స్వరాష్ట్రంలో తెలంగాణ కవులను, సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుకోవలసి ఉందని..అందుకే సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నరని మండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. దేవులపల్లి ప్రభాకర్‌రావు సభాధ్యక్షతన ఏర్పాటైన సాంస్కృతిక సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషను కాపాడుకోవల్సి ఉందన్నారు. కళాకారుల ఆటాపాట తూటాగా మారి స్వరాష్ట్రం వచ్చిందని చెప్పారు. మహాసభలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

1292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS