ఏసీబీకి చిక్కిన కార్యనిర్వహణ అధికారి

Sat,May 25, 2019 05:06 PM

Mancherial rdo office Executive officer in ACB net

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్‌లో కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న మనోహర్‌రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా రామన్న అనే వీడియోగ్రాఫర్ వీడియో కవరేజ్ చేశాడు. దానికి సంబంధించిన బిల్లు రూ.2 లక్షలు ఇవ్వడానికి మనోహర్‌రావు రూ. 50వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇస్తేగాని బిల్లుకు సంబంధించిన చెక్కు ఇవ్వనని సతాయించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఈ రోజు మనోహర్‌రావుకు రూ.50వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles