మహిళను బ్లాక్ మెయిల్ చేసి..రూ.12 లక్షలు మోసం

Sun,December 1, 2019 07:39 PM

నిజామాబాద్: ఓ వ్యక్తి మహిళను బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర నుంచి 12 లక్షలు తీసుకుని వదిలేశాడు. ఈ ఘటన మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..రజిత అనే మహిళను అదే గ్రామానికి గాలి ప్రదీప్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రదీప్ ఆమె ఫొటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. ఆమె వద్ద నుండి సుమారు రూ.12,00,00 (పన్నెండు లక్షల రూపాయలు) తీసుకొని ఆమెను వదిలేశాడు. అయితే రజిత తన డబ్బులు ఇవ్వాలని ప్రదీప్ ని అడిగింది.


నీ భర్తకు మన ఫోటోలు వీడియోలు పంపుతానని ప్రదీప్ బెదిరించడమే కాకుండా..నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడని బాధితురాలు రజిత వాపోయింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు రజితను ఇంట్లోనుంచి వెల్లగొట్టాడు. దీంతో బాధితురాలు మహిళ సంఘాలతో కలిసి గాలి ప్రదీప్ ఇంటి ముందు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. న్యాయం జరగని పక్షంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకున్నారు. ఎస్ఐ సంపత్ కుమార్ సిబ్బందిని పంపి ఆందోళన సద్దుమణిగేలా చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని చెప్పడంతో ఎస్ఐ ఇరువర్గాలను స్టేషన్ కు పిలిచి చర్చించాలని వారికి సూచించారు. అయితే రజిత మాత్రం మహిళాసంఘాలతో స్టేషన్ కు వెళ్లకుండా ప్రదీప్ ఇంటి ముందు కూర్చుంది. అక్కడే వంటా చేస్తున్నారు.


4735
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles