రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

Mon,March 25, 2019 09:23 PM

man suicide laying under the train

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వేబ్రిడ్జి కింద సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి కామారెడ్డి పట్టణాకి చెందిన గంగాసాగర్(28) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వద్ద సూసైడ్ నోట్ లభించింది. తాను 15 ఏళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నానని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుని తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై నాయక్ తెలిపారు.

2597
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles