ఇద్దరు నానమ్మలను చంపిన మనుమడు

Wed,December 12, 2018 11:36 AM

వికారాబాద్ : పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నానమ్మలను వారి మనుమడే హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చన్ గోముల్ కు చెందిన శివకుమార్ మంగళవారం తెల్లవారుజామున తన సొంత నానమ్మ బుచ్చమ్మను కొడవలితో నరికి చంపాడు. ఆ తర్వాత చిన్న తాతయ్య భార్య అంతమ్మపై అదే కోడవలితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న అంతమ్మను వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శివకుమార్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles