గోదావరిలో వ్యక్తి గల్లంతు

Tue,August 13, 2019 09:11 PM

man missing in godavari river at dummugudem mandal

పర్ణశాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి చెందిన నక్కా రాజు (56) అనే వ్యక్తి గోదావరి నదిలో మునిగిన మోటారును తీసే క్రమంలో గల్లంతయ్యాడు. తెలిసిన వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం కె.లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ రైతు సున్నంబట్టి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. సదరు రైతుకు చెందిన మోటార్ గోదావరిలో మునిగి ఉండటంతో దాన్ని బయటకు తీయాలని సున్నంబట్టి గ్రామానికి చెందిన నక్కా రాజుతో మరోవ్యక్తిని కోరాడు. వీరు మోటార్ బయటికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నక్కా రాజు నీటిలో మునిగిపోయాడు.

ఎంతకి బయటకు రాకపోవడంతో టేకుల శ్రీను ఈ విషయాన్ని గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న వారు నక్కా రాజు కోసం గోదావరిలోకి దిగి గాలింపు చేపట్టారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న దుమ్ముగూడెం ఎస్‌ఐ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles