ప‌ట్ట‌ప‌గ‌లు రోక‌లి బండ‌తో మోది భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Mon,August 21, 2017 06:16 PM

Man Kills his wife with wooden pestle in warangal

వ‌రంగ‌ల్ రూర‌ల్: జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ భ‌ర్త క‌ట్టుకున్న భార్య‌నే అతి కిరాత‌కంగా రోక‌లి బండ‌తో మోది హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న జిల్లాలోని న‌ర్సంపేట ప‌ట్ట‌ణంలో ఇవాళ ప‌ట్ట‌ప‌గ‌లు జ‌రిగింది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగానే ఆవేశంతో రోక‌లి బండ‌తో త‌ల మీద కొట్టి భ‌ర్త హ‌త్య చేసిన‌ట్లు స‌మాచారం. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

2182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS