తండ్రిని చంపిన తనయుడు

Tue,July 23, 2019 09:47 PM

man killed his father in indalwai nizamabad

ఇందల్వాయి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని చంపాడన్న కోపంతో కక్ష పెంచుకున్న తనయుడు ఇద్దరు స్నేహితులతో కలిసి కన్న తండ్రి కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన వస్తువులను దహనం చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట గంగబాబు(48) నాలుగు నెలల క్రితం తన భార్య కుంట విజయను రోకలి బండతో మోది హత్య చేశాడు. ఈ ఘటనలో గంగబాబుకు నాలుగు నెలలు జైలులో ఉండి బెయిల్‌పై నెల రోజుల క్రితం విడుదలయ్యాడు. విజయ హత్యకు గురికావడంతో గల్ఫ్ దేశంలో ఉన్న ఇద్దరు కొడుకులు తిరిగొచ్చారు. కొన్ని రోజుల తర్వాత పెద్ద కొడుకు మళ్లీ గల్ఫ్ దేశం వెళ్లగా.. చిన్న కొడుకు ప్రశాంత్ ఇక్కడే ఉండి తన తల్లి హత్యకు కారణమైన తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అదును కోసం నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సొంత ఊరైన వాడి గ్రామం నుంచి తండ్రిని ప్రశాంత్ పిలిపించుకొన్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మృతుడి అత్తగారి ఊరైన ఎల్లారెడ్డిపల్లికి పిలిపించుకొని తండ్రి నిదురించే సమయంలో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక గంగాబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న పోలీసులు గంగబాబు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గంగబాబు సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles