న్యూజిలాండ్‌లో కరీంనగర్ వాసికి జైలు.. లైంగిక వేధింపుల కేసులో 14 ఏళ్ల శిక్ష

Thu,May 16, 2019 10:59 PM

Man from karimnagar gets 14 years imprisonment in new zealand

కరీంనగర్: ఉన్నత చదువులు, ఉన్నతమైన పదవులు.. ఇవన్నీ ఉన్నా.. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దాడికి గురైన చిన్నారి మానసిక స్థితి కోల్పోయి చిట్ట చివరకు యుక్త వయసులో విషయం బయట పెట్టడంతో కేసు నమోదు చేసిన న్యూజిలాండ్ పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

నేరానికి పాల్పడినా, నేరం రుజువైనా ఆ నిందితుడిలో పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదని 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

పూర్తి వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని విద్యారణ్యపురికి చెందిన సర్వాజీ సీతారామారావు ఉన్నత చదువులు చదివి, పై చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 19 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన సీతారామారావు 2003లో పదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఘటన జరిగిన తర్వాత ఆ చిన్నారి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆమె తల్లిదండ్రులు వైద్య చికిత్సలు చేయించినా ఫలితం లేకపోగా వయసు పెరిగే కొద్ది ఆమె ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. యుక్త వయసుకు చేరుకున్న ఆ యువతిని మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించగా, చిన్న వయసులో జరిగిన ఆ ఘటనను బయట పెట్టింది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారిచ్చిన సమాచారం ఆధారంగా సీతారామారావుపై 2017లో కేసు నమోదు చేశారు.

తనకున్న అధికార అండదండలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా న్యాయస్థానం అతను చేసిన పనిని క్షమించలేకపోయింది. నేరం రుజువు కావడంతో న్యూజిలాండ్‌లోని అక్లాండ్ న్యాయస్థానం న్యాయమూర్తి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. గడిచిన 19 ఏళ్లుగా న్యూజిలాండ్‌లోనే స్థిరపడిపోయిన సీతారామారావు గత ఏడాది కుటుంబ సభ్యులను కూడా అక్కడికే తీసుకెళ్లాడు. రెండేళ్ల క్రితం బంధువుల శుభకార్యం కోసం కరీంనగర్‌కు వచ్చాడని అతని గురించి తెలిసిన వారు చెప్పారు.

3203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles