కారును అమ్మేసి వచ్చిన డబ్బులతో..

Wed,June 12, 2019 07:15 AM

man escapes with Car selling money


బంజారాహిల్స్ : కారును అమ్మిపెట్టాలని చెప్పినందుకు.. కారును అమ్మేసి, వచ్చిన డబ్బులతో ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీలోని అజంపురాకు చెందిన సయ్యద్‌ నయీముల్లా హుస్సేనీ అనే వ్యాపారి రెండునెలల క్రితం శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తివద్ద సొహైల్‌ అనే కార్ల బ్రోకర్‌ ద్వారా ఇన్నోవా (టీఎస్‌09ఈడబ్ల్యూ 9693)ను రూ.22 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంట్లో రూ.35 వేలను ఎన్‌ఓసీ ఇచ్చిన తర్వాత ఇస్తానని ఆపాడు.

కొన్నిరోజుల తర్వాత కారును అమ్మేయాలని నయీముల్లా కారుకు చెందిన ఎన్‌ఓసీని తీసుకురావాలని సొహైల్‌కు చెప్పాడు. కారును బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఆటోప్రైడ్‌ ప్రీ ఓన్డ్‌ కార్స్‌ షోరూమ్‌లో అ మ్మకానికి పెట్టారు. అయితే సొహైల్‌... కారు ఓనర్‌ శ్రీకాంత్‌రెడ్డి వద్దనుంచి ట్రాన్స్‌ఫర్‌ పత్రాలతో పాటు అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నాడు. నయీముల్లాకు తెలియకుండానే కారును అమ్మేసి వచ్చిన డబ్బులతో సొహైల్‌ ఉడాయించా డు. వారంరోజుల తర్వాత విషయం తెలుసుకున్న నయాములాపోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

5634
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles