రైలు దిగడమే శాపంగా మారింది..

Fri,April 6, 2018 06:27 AM

Man Died while stepping upto rail

పెద్దపల్లి : తాగునీటి కోసం రైలు దిగడం అతడికి శాపంగా మారింది. రైలు కదులుతున్నదనే తొందరలో ఎక్కే క్రమంలో కాలుజారి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం జరిగింది. కూకట్‌పల్లికి చెందిన చిరు వ్యాపారి భీమా బుద్దేశ్వర్‌రావు (48) బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి గోదావరిఖనిలోని బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యాడు. గురువారం ఉదయం రామగుండం రైల్వేస్టేషన్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. కొత్తపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగా, తాగునీటి కోసం దిగాడు. తిరిగి రైలుఎక్కుతుండగా కాలుజారి కింద పడడంతో గాయాలయ్యాయి. 108లో పెద్దపల్లి ప్రభు త్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అతడికి భార్య ధనలక్ష్మి, కూతురు నేహారిక, కొడుకు దయాసాగర్ ఉన్నారు.

4222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles