వడదెబ్బతో వ్యక్తి మృతి

Mon,April 16, 2018 06:35 PM

man died of sunstroke in bhadradri kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని జూలూరుపాడ్ -చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్నది. ఖమ్మం నుండి తిరిగి వస్తూ జూలూరుపాడ్ లో బస్సు దిగి వెళ్తున్న రామా(38) అనే వ్యక్తి హటాత్తుగా రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే రామాను స్థానిక ఆర్ఎంపీ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ రామా మృతి చెందాడు. రామాది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పక్కన తండా గా పోలీసులు గుర్తించారు. వడదెబ్బ తగలడం వల్లే రామా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

1771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS