వడదెబ్బతో భర్త మృతి, భార్యకు అస్వస్థత

Fri,April 20, 2018 09:18 PM

Man died due to Sun stroke in Nagar kurnool district

నాగర్‌కర్నూల్: వడదెబ్బతో భర్త మృతిచెందగా భార్య అస్వస్థతకు గురైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ లో చోటుచేసుకుంది. భర్త శ్రీరాములు(60), భార్య కిష్టమ్మ(55) వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. ఇంటికి చేరుకున్న అనంతరం అపస్మార స్థితిలోకి వెళ్లారు. గమనించిన కొడుకు శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీరాములు మృతి చెందగా, భార్య కిష్టమ్మ కోలుకుంటుంది.

1582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles