యువతితో స్నేహంగా ఉన్నందుకు.. గుండుకొట్టించి.. చిత్రహింసలు

Wed,April 24, 2019 07:35 AM

Man attacks sisters boy friend

బంజారాహిల్స్: తమ చెల్లితో మాట్లాడుతున్నాడన్న కోపంతో యువకుడిని కిడ్నాప్ చేసి , గుండుకొట్టించి దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ మన్సూర్ అలీఖాన్ అలియాస్ నసీర్(19) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతితో స్నేహంగా ఉంటున్నాడు. తరచూ వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న యువతి సోదరుడు ఇబ్రహీంఖాన్ సోమవారం మధ్యాహ్నం మన్సూర్‌కు ఫోన్ చేశాడు.

మాట్లాడే పని ఉందంటూ జీవీకే మాల్‌వద్దకు పిలిపించాడు. దాంతో అక్కడకు చేరుకున్న మన్సూర్‌ను కారులో ఎక్కాల్సిందిగా కోరారు. దానికి అతను నిరాకరించడంతో బలవంతంగా కారులోకి లాగి సైదాబాద్ సమీపంలోని అక్బర్‌బాగ్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న ఓ హెయిర్ సెలూన్‌లో బలవంతంగా తలపై జుట్టు ను తొలగించారు. అక్కడినుంచి తిరిగి కారులో కొడుతూ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు. ఆ తర్వాత మన్సూర్‌వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, రూ.5వేలను లాక్కొని రాత్రి 7.45 గంటల ప్రాంతంలో అరాంఘర్ చౌరస్తావద్ద వదిలేశారు. మరోసారి తమ చెల్లితో మాట్లాడితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన మన్సూర్ సోమవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఇబ్రహీంఖాన్‌తో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

5207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles