అడిగిన వెంటనే చికెన్ ఇవ్వలేదని మహిళపై దాడి

Wed,October 24, 2018 10:33 PM

man attacked woman for not giving chicken meat in khammam district

ఖమ్మం: అడిగిన వెంటనే చికెన్ ఇవ్వలేదని ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వాకురాలిపై బ్లేడుతో దాడి చేసి పరారైన సంఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం, కల్లూరుగూడెంలో ఉషారాణి అనే మహిళ చికెన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. కాగా బుధవారం అదే గ్రామానికి చెందిన పురం వెంకటేశ్వర్లు చికెన్ కోసం షాపు వచ్చి మాంసం ఇవ్వాలని అడుగగా ఉషారాణి తన భర్త లేడు కొద్ది సేపే ఆగాలని చెప్పింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు ఆగ్రహంతో పక్కనే ఉన్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేయగా ఎడమ చేతికి, గొంతుపై గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి తరలించారు. దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లు అక్కడి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

4153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles