దాహం తీర్చుకునేందుకు వచ్చిన మూగ జీవిపై కర్కషత్వం

Thu,October 18, 2018 06:41 AM

బంజారాహిల్స్ : నోరు లేని మూగ జీవంపై ఓ వ్యక్తి కర్కషత్వాన్ని ప్రదర్శించాడు. దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ కుక్కపిల్లను కాలితో గట్టిగా తన్ని... దాని మరణానికి కారకుడయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... రోడ్ నం.12లో మోబైల్ క్యాంటిన్ వద్ద ప్లేట్లు కడగడానికి పెట్టిన టబ్‌లో ఓ కుక్కపిల్ల నీరు తాగింది. గమనించిన క్యాంటిన్ యజమాని శ్రీను కుక్క పిల్లను గట్టిగా కాలితో తన్నాడు. అంతటి ఊరుకోకుండా దాని చెవులు పట్టుకొని విసిరి పారేశాడు. త్రీవంగా గాయపడ్డ ఆ కుక్కపిల్ల మృతి చెందింది. గమనించిన ఓ కళాశాల విద్యార్థిని జంతు ప్రేమికులకు వ్యాట్సాప్‌లో ఆ వీడియోను పంపించింది. పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆంచల్ కన్నా పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనుపై కేసు నమోదు చేశారు.

4649
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles