మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

Sun,March 10, 2019 05:47 AM

man arrested for Woman harassment case

హైదరాబాద్ : మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... రాంనగర్‌కు చెందిన ఓ మహిళ(30)కు కొంత కాలంగా దయాకర్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట ఆమె ఇంటికెళ్లిన దయాకర్ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. తాగిన ఆమె నిద్రలోకి జారుకున్న తరువాత లైంగికదాడి చేసి, మరుసటి రోజు నుంచి కోరిక తీర్చమని మహిళను వేధిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అతడి వేధింపులు అధికమవడంతో ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. లైంగికదాడి కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

2096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles