ఆస్తి కోసం తల్లికి వేధింపులు

Tue,April 9, 2019 07:25 AM

Man arrested for harassing  mother

ఉస్మానియా యూనివర్సిటీ: ఆస్తి కోసం తల్లిని వేధిస్తున్న కుమారుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. తార్నాకలో నివాసముండే రచ్చ వరలక్ష్మికి ఇద్దరు సంతానం. ఒకరు అమెరికాలో స్థిరపడగా, మరొకరైన శ్రీనివాస్ (35) తల్లితోనే ఉంటున్నాడు. ఇతనికి భార్య, కూతురు ఉన్నారు. ఇతను గతంలో ఒక స్టూడియోలో పనిచేయగా.. అతని వ్యవహారశైలి బాగా లేకపోవడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. కాగా.. తనకు ఆస్తి పంచి ఇవ్వాలని శ్రీనివాస్ తరుచూ తల్లిని వేధించేవాడు.

దీనిపై పలుమార్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో ఆస్తి పంచి ఇవ్వాలంటూ తల్లి పీక పిసికి, తలపై కొట్టి.. ఇంటి నుంచి వెళ్లగొట్టి తాళం వేసుకున్నాడు. దీనిపై వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆగ్రహంతో కత్తితో తల్లిపై దాడి చేస్తానని చెప్పాడు. దీనిపై వరలక్ష్మి తిరిగి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

1846
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles