వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న మల్కాపూర్ గ్రామస్థులు

Thu,November 15, 2018 07:53 PM

Malkapur villagers opposes Vanteru pratapreddy campaign

సిద్దిపేట: గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మల్కాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం మల్కాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా..గ్రామస్తులు వాహనానికి అడ్డువచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని..తాము సీఎం కేసీఆర్ కే ఓటు వేస్తామని మల్కాపూర్ ప్రజలు స్పష్టం చేశారు. మా ఊర్లో ప్రచారం చేయవద్దని ప్రతాప్ రెడ్డిని గ్రామస్థులు డిమాండ్ చేశారు. జై తెలంగాణ..జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

5434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles