ఐదు పర్వతాలు ఎక్కిన.. తెలంగాణ బిడ్డగా...

Tue,March 26, 2019 07:27 AM

malavath poorna climbing indonesia Carstensz Pyramid

హైదరాబాద్ : తెలంగాణ బిడ్డ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇండోనేషియాలోని 4,884 మీటర్ల కార్టెంజ్ పిరమిడ్‌ను అధిరోహించింది. జాతీయ జెండాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ జెండాను ప్రదర్శించింది. ఓసియానియా రీజియన్‌లో ఈ పిరమిడ్ అతి పొడవైంది. ఏడుఖండాల్లో ఏడు పొడవైన పర్వతాలు ఉండగా, ఇదీ అందులో ఒకటి కావడం విశేషం. పర్వతారోహకులు ఈ ఏడు పర్వాతాలను అధిరోహించడం ఒక సవాల్‌గా తీసుకొని ప్రయత్నం చేస్తుంటారు. మాలావత్ పూర్ణ కార్టెంజ్ అధిరోహణతో మొత్తం ఐదు పర్వతాలను అధిరోహించిన ఘనత సాధించింది. ఇంకో రెండు పర్వతాలు అధిరోహిస్తే తన లక్షాన్ని చేరుకుంటుంది. ప్రస్తుతం పూర్ణ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో చదువుతున్నది. తన లక్ష్యానికి చేరువవుతుండటం పట్ల పూర్ణ సంతోషం వ్యక్తంచేసింది.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles