ఎనుమాములలో మొక్కజొన్నల కొనుగోలు ప్రారంభం

Fri,October 12, 2018 07:57 PM

maize purchase centres started in Enumamula market

వరంగల్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. ఎనుమాములతో పాటు కమలాపూర్, ఎల్కతుర్తిలో మరో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన మొక్కజొన్నలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న 700 రూపాయలు మద్దతు ధర పొందాలని మార్క్ ఫెడ్ మేనేజర్ రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు నవంబర్ చివరి వరకు కొనుగోలు నడుస్తాయన్నారు.

రైతులు తొందరపడి మొక్కజొన్నలను మార్కెట్ యార్డుకు తరలించి ఇబ్బందులు పడొద్దని సూచించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రైతు వద్ద ఉన్న చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles