రవీంద్రభారతిలో బసవేశ్వర జయంతి ఉత్సవాలు

Mon,May 9, 2016 12:33 PM

mahathma basaveshwara birth day celebrations

హైదరాబాద్: మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఇవాళ అధికారికంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతిలో బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా బసవేశ్వరుడు హైందవ మతాన్ని ఉద్ధరించిన ప్రముఖుల్లో ఒకరు. సమాజంలో కుల వ్యవస్థ, లింగ వివక్షతను సమూలంగా రూపుమాపేందుకు పాటుపడిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతడు బోధించిన మార్గం. ఆయన రచించిన ప్రవచనాలు బసవ పురాణంగా ప్రసిద్ధి చెందాయి. బసవ రచించిన ప్రవచనాలు పరమత సహనాన్ని అలవరుస్తున్నాయి. మానవ జన్మలో చెడును ప్రేరేపించే వారికి బసవ ప్రవచనాలు చేసే హిత బోధ సన్మార్గం వైపునకు నడిపిస్తాయి. జన చేతనానికి దారి తీసే వచనాలు బోధించిన బసవడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారి అధికారింగా నిర్వహిస్తోంది.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles