మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం వెల్లడి

Thu,April 25, 2019 09:53 PM

maharashtra officials praise mission bhagiratha scheme

నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మహారాష్ట్ర జీవన ప్రాధికారణ్, కార్యదర్శి సభ్యుడు పీ వెల్స్రు (ఐఏఎస్) అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల తీరును మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన ఇవాళ పరిశీలించారు. ఎల్లూరు వద్ద నిర్మించిన మిషన్ భగీరథ పథకంలోని పంప్‌హౌస్‌లో అమర్చిన 12 మోటార్లు, స్వీచ్ యార్డును, కలెక్షన్ వెల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతి ఇంటింటికీ నల్లా ద్వారా మంచి నీళ్లు సరఫరా చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం బృందం సభ్యులు నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిగట్టుపై నిర్మించిన మిషన్‌ భగీరథ నిర్మాణం పనులను పరిశీలించారు.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles