తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది: మంత్రి కేటీఆర్

Wed,October 10, 2018 06:56 PM

mahabubnagar tdp leaders join in trs party in the presence of minister ktr

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. టీఆర్‌ఎస్ అవిర్భవించినప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, మహబూబ్‌నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన మంత్రి కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రసంగించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతోనే టీడీపీ అంతర్ధానం అయిందన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో అజేయ శక్తిగా ఎదిగిందని మంత్రి అన్నారు. 85 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తదని ఎన్డీటీవీ సర్వే చెప్పిందని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాలకు పోటీచేస్తే ఒకే స్థానం దక్కిందన్నారు.

"60 రోజులు మాకోసం కష్టపడితే 60 నెలలు మీకోసం పనిచేస్తాం. తలాపున కృష్ణా పారుతున్నా తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పాపం ఎవరిదో మీకే బాగా తెలుసు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ చేపట్టాం.. తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. రైతుకు 8 వేల పెట్టుబడి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే.." అని మంత్రి స్పష్టం చేశారు.

దేవరకొండ నియోజకవర్గానికి 55 కోట్లు కేటాయించిన ఘనత మంత్రి కేటీఆర్‌ది.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. దేవరకొండ నియోజకవర్గంలో డిండి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి.. కేఎల్‌ఐ నుంచి డిండికి మూడు పర్యాయాలు నీళ్లు వచ్చాయంటే అది సీఎం చలవే. అత్యధిక రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ. రవీంద్రకుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. సీఎం కేసీఆర్‌తో మరిన్ని అభివృద్ధి పనులు చేయించుకుందాం -ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి

2367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles